ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ అరెస్ట్ చేసిన ఇద్దరు కేరళ సన్యాసినిలను ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సింది గుండాలనని, నన్స్‌నని కాదని వ్యాఖ్యానించారు.
మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతూ, బలవంతంగా మత మార్పిడిలు చేయిస్తున్నారనే ఆరోపణలతో నిన్న ఛత్తీస్‌గఢ్‌లో కేరళకు చెందిన ఇద్దరు నన్స్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నన్స్ అరెస్టును పార్లమెంటు వేదికగా స్పందించారు. దేశంలో అల్లరిమూక (Mob) పాలన కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి తప్పు చేయకున్నా అమాయకులను తీసుకెళ్లి జైళ్లలో పెడుతున్నారని శశిథరూర్ ఆరోపించారు.
నారాయణపూర్‌కు చెందిన ముగ్గురు బాలికలను అక్రమంగా రవాణా చేసి బలవంతంగా మతం మార్చారని ఆరోపిస్తూ స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదు చేయడంతో జూలై 25న దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ప్రీతి మెర్రీ, వందన ఫ్రాన్సిస్ అనే ఇద్దరు నన్స్ తో పాటూ మాండవి అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
కాథలిక్ నన్స్ అరెస్టుపై కేరళలో అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నిరసనలు చేపట్టింది ఇవాళ పార్లమెంటులోనూ అరెస్ట్ విషయమై మాట్లాడారు. మా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వారి విశ్వాసం కారణంగా వారిని జైలులో పెట్టారని శశిథరూర్ ఆరోపించారు.
