అన్నవరంకు దాశరథి పురస్కారం

Published on 

కరీంనగర్‌: చెందిన ప్రముఖ కవి అన్నవరం దేవేందర్‌కు తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం వరించింది. దాశరథి శతజయంతోత్సవాల సందర్భంగా ఈ అవార్డును ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)లో కేదారమ్మ-దశరథం దంపతులకు 1962 అక్టోబర్‌ 17న దేవేందర్ జన్మించారు. ఎంఏ సామాజిక శాస్త్రం పూర్తి చేసిన ఆయన, జిల్లా పరిషత్‌లో సూపరింటెండెంట్‌గా 2020లో ఉద్యోగ విరమణ పొందారు. తెలంగాణ మాండలికంలో కవిత్వాలు రాస్తూ, నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా రచనలు చేస్తూ, తన కలం నుంచి ధికార స్వరాన్ని వినిపించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అన్నవరం ఇప్పటివరకు 16 పుస్తకాలు వెలువరించారు. ఇందులో 12 కవిత్వాలు, 2 ఆంగ్ల అనువాద కవిత్వం, 2 వ్యాసాల సంపుటిలు ఉన్నాయి. 2001లో ‘తొవ్వ ’తో తన మొదటి కవిత సంపుటి వెలువరించారు. ఆ తరువాత 2003లో ‘నడక’ తన ద్వితీయ పుస్తకాలు అచ్చువేశారు. 2005లో మంకమ్మతోట లేబర్‌ అడ్డా పుస్తకం ఆవిషరించారు. ఆ పుస్తకాన్ని డిగ్రీ పాఠ్యాంశంగా చేర్చారు. ‘బుడ్డ పరలు’ నానీలు 2006లో, బొడ్డు మల్లె చెట్టు 2008లో, పొద్దుపొడుపు కవిత సంకలాన్ని 2011లో ఆవిష్కరించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form