యెమెన్‌లో ఓ పౌరుడి హత్య కేసులో దోషిగా తేలిన భారతీయ నర్సు నిమిషా ప్రియాకు జులై 16న ఉరిశిక్ష అమలు కానుంది. 2017లో యెమన్‌లో వ్యాపారిని హత్య చేసిన కేసులో..కేరళకు చెందిన నర్సుకు మరణ శిక్ష విధించింది కోర్టు. ఈనెల 16న నిమిషా ప్రియకు మరణ శిక్ష అమలు చేయనున్నారు. నిమిషకు మరణ శిక్ష అమలుకు సంబంధించిన సమాచారాన్ని కేరళలోని కుటుంబసభ్యులకు యెమెన్ అధికారులు తెలియజేశారు. 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లిన నిమిషా.. అక్కడ ఓ వ్యక్తితో కలిసి క్లినిక్ ప్రారంభించింది. యెమెన్ చట్టాల ప్రకారం స్థానిక భాగస్వామితో కలిసి వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఆమె తలాల్ అబ్దో మహ్దీ అనే వ్యక్తిని కలిసి బిజినెస్ పార్ట్నర్షిప్గా చేసుకున్నారు. కొంత కాలానికి అతడితో విబేధాలు తీవ్రమయ్యాయి. భాగస్వామి మోసంతో హత్యకు పాల్పడ్డారు. అతడి వద్ద చిక్కుకుపోయిన నిమిషా పాస్‌పోర్టును తిరిగి పొందాలనే ఉద్దేశంతో మహ్దీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది.. కానీ అది డోస్ ఎక్కువకావడం అపస్మారక స్థితిలోకి వెళ్లి అతడు మృతి చెందాడని నిమిషా కుటుంబ సభ్యులు తెలిపారు. యెమెన్ నుంచి తప్పించుకునేందుకు నిమిషా ప్రయత్నించగా.. విమానాశ్రయంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరకు 2018లో ఆమెపై హత్యారోపణలు రుజువు కావడంతో యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వం, మానవహక్కుల సంఘాల జోక్యం కోరుతున్నారు. ‘బ్లడ్ మనీ’ చెల్లించి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. గతేడాది యెమెన్ అధ్యక్షుడు నిమిషా మరణశిక్షను ఆమోదించడంతో చివరి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. యెమెన్‌లో “బ్లడ్ మనీ” చట్టం ప్రకారం.. బాధిత కుటుంబం శిక్షను రద్దు చేయాలనుకుంటే నష్టపరిహారం చెల్లింపుతో పరిష్కరించవచ్చు. కానీ, తలాల్ మహ్దీ కుటుంబం ఇప్పటివరకు క్షమాభిక్షకు ముందుకు రాలేదు. చివరకు 2018లో ఆమెపై హత్యారోపణలు రుజువు కావడంతో యెమెన్ కోర్టు దోషిగా తేల్చి, మరణశిక్ష విధించింది. దీంతో ఆమెకు ఉరి శిక్ష జూలై 16 న అమలు చేయనున్నారు.
