AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలో తన ప్రతిష్టకు భగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆయనపై కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. BNS 74, 75, 79, 296 r/w 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న, ఇతర నేతలు మాట్లాడిన వీడియో క్లిప్‌ను ఆమె పోలీసులకు అందజేశారు. ప్రసన్నతో పాటుగా మరికొంత మందిపైనా కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం. అవినీతిలో ప్రసన్నకుమార్‌రెడ్డి పీహెచ్డీ చేశారంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారు. దీంతో ఆయన కామెంట్స్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
