రాజస్థాన్లో మరో విమాన ప్రమాదం జరిగింది. చురు జిల్లాలోని రతన్గఢ్లో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది.ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానం శిథిలాల్లోంచి పైలట్ మృతదేహన్ని బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు.
