అలియా భట్ మాజీ అసిస్టెంట్ అరెస్ట్

Published on 

బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు వేదిక ప్రకాశ్ శెట్టిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలియా పేరుతో ఆమె దాదాపు రూ.77 లక్షలు మోసానికి పాల్పడినట్లు తెలిపారు. అలియా నిర్మాణసంస్థ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ ఫ్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్నప్పుడు వేదిక ఈ అక్రమాలకు పాల్పడింది. 2021 నుంచి 2024 వరకూ అలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. నటికి సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్ లను చూసుకునేది. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే నకిలీ బిల్లులు క్రియేట్ చేసి అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నటి తల్లి, నటి, దర్శకురాలు సోనీ రజ్దాన్ ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు కింద వేదికను అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లులు తయారుచేసి అలియాతో సంతకాలు చేయించి డబ్బును స్వాహా చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అలియా సంతకం చేసిన తర్వాత వేదిక ఈ మొత్తాన్ని తన స్నేహితుల అకౌంట్ కు పంపి.. తర్వాత వినియోగించేదని పోలీసులు తెలిపారు. తనపై కేసు నమోదైన తర్వాత వేదిక పరారైంది. రాజస్థాన్, కర్నాటక, పూణెల్లో తిరిగింది. చివరకు బెంగళూరులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ముంబయికి తీసుకువచ్చారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form