ఒవైసీ కాలేజీ కూల్చడం లేదు: హైడ్రా కమిషనర్

Published on 

  • ఒవైసీ కాలేజీ కూల్చం
  • సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకుంటాం
  • ఒవైసీ కాలేజీ ఆస్తి విలువ రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ
  • పేద ముస్లిం మహిళలకు దిక్సూచి
  • నాయకుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం

TS: పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీ ఉంది. అయితే ఈ కాలేజీని హైడ్రా ఎందుకు కూల్చడం లేదంటూ ప్రతిపక్షాలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తాజాగా దీనిపై  హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ స్పందించారు. ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదనేదానిపై క్లారిటీ ఇచ్చారు.  

ఎలాంటి ఫీజులు వసూలు చేయరు

’ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు.. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు.. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం. పేద ముస్లిం మహిళలను వెనుక బాటుతనం నుంచి ఒవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోంది.  ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం‘ అని వెల్లడించారు.   ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని ఏవీ రంగానాథ్ తేల్చిచెప్పారు రంగనాథ్.  25 ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చి, ఎంఐఎం ఒవైసీ కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యాపార భాగస్వామి అయిన కింగ్స్ గ్రూప్ విక్రయిస్తోంది. ఇక్కడ ఒక్కో ఎకరం ఖరీదు రూ. 40 కోట్లు. కాబట్టి, ఈ సరస్సు ఆస్తి విలువ రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ. హైడ్రా ఇప్పుడు ఈ సరస్సును అభివృద్ధి చేస్తోంది. ఆక్రమణదారులు హైకోర్టు నుండి స్టే ఆర్డర్‌లతో చట్టపరమైన అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ, హైడ్రా సరస్సు అభివృద్ధి పనులను బలవంతంగా కొనసాగిస్తుంది. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నా్ం అని రంగనాథ్ తెలిపారు.  

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form