శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో రెండు వారాల వేసవి సెలవుల తర్వాత మంగళవారం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. లోయలో వేడిగాలుల నేపథ్యంలో పాఠశాల సమయాన్ని మార్చడమో లేదా వేసవి సెలవులను పొడగించడమో చేయాలని చాలామంది తల్లి దండ్రుల నుండి వినతులు వచ్చినప్పటికీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సోమవారం వేసవి సెలవులను పొడిగించకూడదని నిర్ణయించింది.
ఉదయం 6.30 నుండి 7.00 గంటల మధ్య తమ స్కూల్ బస్సును పట్టుకోవడానికి పిల్లలు ఉదయం 5.30 గంటలకు నిద్రలేవడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూపించే అనేక వీడియోలు తల్లిదండ్రులు ఆన్లైన్లో పోస్ట్ చేశారు.
అయితే, ప్రకటన వెలువడిన రెండు గంటల్లోనే, లోయలో భారీ వర్షాలు కురిశాయి మరియు కాశ్మీర్ అంతటా ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పడిపోయింది.
లోయలోని మునిసిపల్ పరిధిలోని సంస్థలు ఉదయం 7.30 నుండి 11.30 వరకు పనిచేస్తాయని, ఇతర ప్రాంతాలలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేస్తాయని విద్యా మంత్రి Xలో తెలిపారు.
