బీజాపూర్, మే 12: బీజాపూర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. లింగాపూర్ గ్రామానికి చెందిన నాగ భండారి గత కొంత కాలంగా కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగుతున్నాడు. నాగ భండారిని అతని ఇంటికి కొద్ది దూరంలో పదునైన ఆయుధంతో గుర్తుతెలియని వ్యక్తలు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో గ్రామస్తులలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.
అయితే నాగ భండారి అన్నయ్య తిరుపతి భండారిని 2024 అక్టోబర్ 24న మావోయిస్టులు హత్యచేయడంతో ఆ కోణంతో దర్యాప్తు నిర్వహిస్తున్నారు పోలీసులు.
