ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఓయూలో ‘మేడే’ వేడుకలు

Published on 

హైదరాబాద్: అంతర్జాతీయ శ్రామిక దినం ‘మేడే’ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జెండాను ఆ సంఘ సీనియర్ నాయకురాలు బాల మణెమ్మ ఎగురవేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ పీపుల్స్ జేఏసీ కో కన్వీనర్ కన్నెగంటి రవి మాట్లాడుతూ అమెరికా లోని చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని విధానం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని, ఆ సందర్భంగా ఆనాటి పోలీసులు కార్మికులపై కాల్పులు జరపడంతో ఆ కాల్పుల్లో ఎనిమిది మంది కార్మికులు అమరులయ్యారని గుర్తుచేశారు.

కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులకు ఉరిశిక్షల విధించారని, దీంతో దేశవ్యాప్తంగా యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం తిరుగుబాటు జెండాను ఎగరవేడంతో దిగొచ్చిన యాజమాన్యం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇది కార్మికులు సాధించిన విజయమని, ప్రపంచవ్యాప్తంగా ఇవ్వాల ఎనిమిది గంటల పని విధానం మేడే కార్మికుల పోరాటం ఫలితం అని తెలిపారు. ఈ మహత్తరమైన పోరాటంలో రక్తంతో తడిసిన జెండానే ఎర్రజెండాగా ఇవాళ ప్రజల ముందు నిలిచింది గుర్తుచేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ కేటగిరీలలో పారిశుద్ధ రంగంలో,హౌస్ కీపింగ్,రోడ్లు ఊడ్చటం ,హాస్టల్ లో పనిచేసే కార్మికులను పనివున్నచోట అందర్నీ పర్మినెంట్ చేయాలని చట్టాలు చెబుతున్నా పాలకులు వాటిని అమలు చేయడంలో చొరవ చూపటం లేదని విమర్శించారు. కార్మికులను దోచుకోవడం కోసమే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వంటి పద్ధతులను తీసుకొచ్చారని, తమ ఇష్టం వచ్చినప్పుడు పని నుంచి తొలగించడం వంటి చర్యలు కార్మిక చట్టాలకు విరుద్ధమని తెలిపారు.

కేంద్రంలో ఉన్న బీజేపీపి ప్రభుత్వం పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను నాలుగు లేబర్ కోడ్ లుగా చేసి కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. తిరిగి 12 గంటల పని విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు తక్షణమే ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోకపోతే కార్మిక లోకం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు స్టాలిన్, ఎఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షులు లెనిన్, నాయకులు కళ్యాణ్ అనిల్ అరుణ్ తో పాటు పద్మ,లక్ష్మీ,లక్ష్మమ్మ,లక్ష్మీ, వెంకట రమణ,అశ్విని తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form