TG: మాజీ సీఎం కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. తులం బంగారం కోసం ఆశపడి ఓటేశారని ఎద్దేవ చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ పరిపాలనలో రైతుబంధుకు రామ్ రామ్ చెప్పేశారని విమర్శించారు.
దళిత బందుకు జై భీమ్ చెప్పేశారని, తులం బంగారం ఏమైందని, కాంగ్రెస్ పాలనపై రాష్ట్రమంతటా అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ కరెంటు కోతలు కనబడుతున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దాం’ అని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
త్వరలోనే భారీ సభ పెట్టుకుందామని పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ దివాలా తీయించిందని విమర్శించారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని అన్నారు. మాట్లాడితే ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ అంటున్నారు.. అసలు ఫాంహౌస్‌లో పంటల తప్ప ఏం పండుతాయి అని ప్రశ్నించారు. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే వారి పార్టీకే వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక గాలివీస్తుందని.. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరని కేసీఆర్ వ్యాఖ్యానించారు.