నాగ్‌పూర్ టూ ముంబైకి ఇక 8 గంటల్లోనే ప్రయాణం.. !

Published on 

బాంబే: మహారాష్ట్రలో అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటైన సమృద్ధి మహామార్గ్ తుడిమెరుగులు దిద్దుకుంటోంది. చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. మరో 15 రోజుల్లో పూర్తవboతుంది. ప్రస్తుతం ఇగత్‌పురి నుంచి ముమి వరకు 76 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. 701 కి.మీ పొడవైన హైవే త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ దీనిని ప్రారంభించనున్నారు. ఈ రహదారి వల్ల ముంబై-నాగ్‌పూర్ మధ్య ప్రయాణ సమయం 16 గంటల నుంచి 8 గంటలకు తగ్గుతుంది. ఈ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే మహారాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలల ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ బొలిరామ్ గైక్వాడ్‌కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

701 కి.మీ పొడవు, 6 లేన్ల హైవే అయిన ఇది దేశంలోనే అత్యంత హైటెక్ ఎక్స్‌ప్రెస్ వే. 65 ఫ్లై ఓవర్లు, 24 ఇంటర్‌ఛేంజ్‌లు, 6 సొరంగాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా మహారాష్ట్రలోని 10 జిల్లాలు ప్రత్యక్షంగా, 14 జిల్లాలు పరోక్షంగా అనుసంధానించబడుతున్నాయి. కొత్తగా 18 స్మార్ట్‌ టౌన్‌లు నిర్మించనున్నారు. దీంతో స్థానికంగా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form