కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో తెల్లవారుజామున ప్రకంపనలు సంభవించాయి. మరోవైపు ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురి, సిలిగురి, డార్జిలింగ్, దినాజ్‌పూర్‌లో భూప్రకంపనలు వచ్చాయి. పొరుగు రాష్ట్రమైన బీహార్‌లో కూడా విస్తృతంగా ప్రకంపనలు వచ్చాయి.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. వార్తా సంస్థ ANI ప్రకారం, భూకంపం యొక్క మూలం నేపాల్‌లోని లోబుచేకి కేంద్రంగా చోటుచేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తొంది.