విజయసాయి రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం

Published on 

AP: వైఎస్ఆర్ సీపీ రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డిని ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ ప్రశ్నలు సంధించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి వివరాలు వెల్లడించారు. తన స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేశారని చెప్పారు. తనను మొత్తం 25 ప్రశ్నలు అడిగారని వివరించారు. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందన్నారు.

కేవీ రావు తనకు తెలియదు అధికారులకు చెప్పానన్నారు. అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఫోన్ చేయలేదని స్ఫష్టం చేశారు. మే నెల 2020 లో తాను ఫోన్ చేశానని …కేవీ రావు చెప్తున్నదంతా అసత్యం అన్నారు. కేవీ రావును ఈడీ విచారణకు పిలవాలని ఈడీ అధికారులను కోరినట్టు వెల్లడించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form