హైదరాబాద్: చర్లపల్లి(Charlapllay) రైల్వే నూతన టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. సర్వాంగ సుందరంగా, అత్యాధునిక హంగులతో ప్రారంభమైంది. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. హైదరాబాద్ లోని, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ తర్వాత చర్లపల్లి టెర్మినల్ రైల్వే సేవలు అందించనుంది. దీనిలో ఎయిర్ పోర్టులో ఉండే సౌకర్యాలు, వసతులు కల్పించారు. మొత్తం రూ.430 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం 9 ఫ్లాట్ ఫామ్లు, 7 లిఫ్టులు సహా అనేక ఏర్పాట్లు ఉన్నాయి.
ప్రస్తుతం మూడు రైల్వే స్టేషన్లు సిటీలో ఉన్నాయి. వీటికి బదులుగా చర్లపల్లి టెర్మినల్ తో నగర పరిసరాల్లోనే సేవలు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా గూడ్స్ రవాణాకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది.