ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని కుత్రు రోడ్డుపై నక్సలైట్లు సైనికులతో కూడిన బొలెరో వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 8 మంది డిఆర్‌జిలతో సహా ఒక డైవర్ మరణించారు. మరో ఐదు మందికి పైగా సైనికులు గాయపడ్డారని బస్తర్ ఐజీ సుందర్రాజ్ ధ్రువీకరించారు.
గత నాలుగు రోజులుగా నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ లో భాగంగా కూంబింగ్ లో పాల్గొని అలసిపోయిన సైనికులు తిరుగు ప్రయాణంలో పికప్ వాహనం ఎక్కారని, పేలుడు జరిగిన సమయంలో వాహనంలో దాదాపు 20 మంది సైనికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సైనికులను తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
ఈ ఘటనలో మరణించిన DRG హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్ గతంలో నక్సల్ లో పనిచేసి పోలీసుల ముందు 2017లో లొంగిపోయాడు. 2019లో అతను డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)లో చేరాడు. అప్పటి నుండి అనేక నక్సల్స్ వ్యతిరేక అపరేషన్లలో పాల్గొనట్లు సమాచారం.