లా స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Published on 

TS: నగరంలోని మలక్‌పేట పోలీస్ స్టేషన్‌ ఎదుట ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్‌లో లా స్టూడెంట్ శ్రావ్య(20) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించా రంటూ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమగ్ర విచారణ చేపట్టి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగం చేస్తుంద‌ని శ్రావ్య మృతికి లైంగిక వేధింపులే కార‌ణ‌మ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. న‌వీన్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర శ్రావ్య అసిస్టెంట్ గా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. ఆదివారం రాత్రి ఏం పని ఉంద‌ని శ్రావ్య‌ను న‌వీన్ ఆఫీసుకు పిలిచాడ‌ని ప్ర‌శ్నించారు. ఆ ఆఫీసు సిబ్బందిని కూడా అరెస్ట్ చేశాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న రాత్రి జ‌రిగితే ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు యాక్ష‌న్ తీసుకోలేద‌ని అన్నారు. పెద్ద కులాల వారికి ఇలాగే జ‌రిగే ఊరుకుంటారా? అని ప్ర‌శ్నించారు. హ‌త్య చేసి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీకిరించారని గిరిజ‌న సంఘాల నాయ‌కులు, కుటుంబ స‌భ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. వెంట‌నే పోలీసులు ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి నింధితుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form