AP: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ (సోమవారం) సైకిల్‌పై పార్లమెంట్ కు వెళ్లారు. పసుపు రంగు సైకిల్ (Bicycle) పై పసుపు రంగు అంగీ (Yellow shirt), తెల్ల దోవతి, తలకు తలపాగా ధరించి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగి దట్టంగా పొగమంచు కమ్ముకుని ఉదయం తొమ్మిదింటి వరకు కూడా ఏమీ కనపడని దుస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అప్పలనాయుడు గుర్తుచేశారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రభుత్వానికి ఆ సందేశం చేరవేసేందుకు అప్పలనాయుడు అలా చేశారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తమ వంతుగా బాధ్యత తీసుకోవాలని సూచించారు.























