Delhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలో మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ పార్లమెంట్‌లో చర్చకు అనుమతించడం లేదని ఆరోపించారు. ‘ఇది 2024 సంవత్సరానికి చివరి కాలం’ అని ప్రధాని అన్నారు.
ఈ పార్లమెంటు సమావేశాలు అనేక విధాలుగా ప్రత్యేకమైనవి. ఇప్పుడు అతిపెద్ద విషయం ఏమిటంటే, మన రాజ్యాంగం 75 సంవత్సరాల ప్రయాణం, 75వ సంవత్సరంలోకి ప్రవేశించడం ప్రజాస్వామ్యానికి మంచి అవకాశమని గుర్తు చేశారు. రాజ్యాంగం 75వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించడానికి రేపు అందరూ రాజ్యాంగ పరిషత్‌లో కలిసి రావాలని ప్రధాని కోరారు.
ఈ సందర్భంగా విపక్ష ఇండియా కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని . ప్రజలచే తిరస్కరణకు గురైన కొందరు గూండాయిజం ద్వారా పార్లమెంట్‌ను నియంత్రించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు వారి చర్యలన్నింటినీ లెక్కిస్తారని.. సరైన సమయంలో శిక్ష విధిస్తారని వ్యాఖ్యానించారు.