సంభల్‌లో ఇంటర్నెట్‌, స్కూల్స్‌ బంద్‌

Published on 

UP: ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో (Sambhal) ఉద్రిక్తత కొనసాగుతున్నది. మసీదు సర్వే సందర్భంగా హింస చెలరేగడంతో నలుగురు యువకులు మరణించడంతోపాటు 30 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉండటంతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సంభల్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్‌ చేశారు.

పట్టణంలో మొగల్‌ కాలానికి చెందిన జామా మసీద్‌ ఉన్నచోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో గత మంగళవారం నుంచి సంభల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం పెద్ద గుంపుగా వచ్చిన కొందరు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో ముగ్గురు యువకులు మరణించగా, 30 మంది పోలీసులు గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో ఒక కానిస్టేబుల్‌ తలకు తీవ్ర గాయం కాగా, డిప్యూటీ కలెక్టర్‌ కాలు విరిగింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form