హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సరేందర్ పన్వార్‌ను ఈడీ అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో సోనిపట్ ఎమ్మెల్యేను గురుగ్రామ్‌లో నిన్న అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
ఇదే కేసులో గతంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్‌ను అరెస్టు చేశారు. కొండలు, గుట్టలు అక్రమంగా తొవ్విన కేసులో హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై మనీల్యాండరింగ్ కేసు పెట్టారు. యమునాగర్తో పాటు సమీప జిల్లాల్లో మైనింగ్ జరిగింది. అయితే ఆ ప్రాంతాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్యాన్ విధించింది. మైనింగ్ ప్రాంతాల కోసం ప్రవేశపెట్టిన ఈ-రావణ స్కీమ్ కేసులో ఈడీ విచారణ చేపడుతోంది. ఆ స్కీమ్‌లో ఫ్రాడ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2020లో హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ స్కీమ్‌తో మైనింగ్ ప్రాంతాల్లో ట్యాక్సులు వసూల్ చేశారు.