మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. గత కొంతకాలంగా లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్‌లు గతంలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ పెళ్లి కోసం మెగా కుటుంబం మీదనే శ్రీజ పోలీస్ కేసు పెట్టింది. మీడియా ముందుకు వెళ్లి తమకు ప్రాణహానీ ఉందని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఆ తరువాత కొన్నేళ్ళకు వీరి ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో శ్రీజ అతని వదిలేసి చిరు వద్దకు వచ్చేసింది. వారిద్దరికి ఒక పాప కూడ జన్మించింది.
విడాకుల అనంతరం బీజేపీ లో చేరిన శిరీష్ కొన్నేళ్లుగా సైలెంట్ గా మారాడు. ఆ సమయంలోనే అతనికి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో అతన్ని కాపాడలేకపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే తండ్రిని కడసారి చూపించడానికి వాళ్ల కూతురును శ్రీజ తీసుకెళుతుందో లేదో తెలియాల్సి ఉంది.