ఛత్తీస్‌గఢ్: నారాయణపూర్‌లో భద్రతా బలగాలకు- నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సలైట్లతో పాటూ ఒక జవాను మరణించిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్ర గాయపడటంతో వారిని రాయ్‌పూర్‌కు తరలించి రామకృష్ణ కేర్ హాస్పిటల్స్‌లో చికిత్స అందిస్తున్నట్లు ఐజి బస్తర్ పి సుందర్‌రాజ్ తెలిపారు.
అయితే ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం విష్ణుదేవ్ సాయి ట్వీట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ఒక STF జవాను వీరమరణం పొందడం, ఇద్దరు జవాన్లు గాయపడినందుకు విచారకరమన్నారు. గాయపడిన సైనికులను వెంటనే విమానంలో తరలించి చికిత్స అంధించాలని కోరారు. ‘‘నక్సలైట్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో నక్సలైట్లు కలవరపడుతున్నారని. వారిని నిర్మూలించేందుకు మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైందని, లక్ష్యం నెరవేరే వరకు మౌనంగా ఉండబోమని’’ హెచ్చరించారు.