ములుగు జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు అరెస్ట్

Published on 

  • మందుపాతరలు అమరుస్తుండగా అరెస్ట్
  • అరెస్ట్ అయిన వారిలో ఒక డిప్యూటీ దళ కమాండర్, ముగ్గరు మిలీషియా సభ్యులు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తడపాల దగ్గర ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ములుగు జిల్లా ఎస్పీ ప్రకటించారు.

13.06,24 బుధవారం మధ్యహ్నం తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గల వెంకటాపురం మండలం తడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన మావోయిస్టులు, మిలిషియా సభ్యులు కలిసి కర్రెగుట్టలపై వారి గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రజలను, పోలీసులను అటవీ ప్రతంలోకి రాకండా వారిని చంపాలనే ఉద్ద్యేశంతో కాలిబాట వెంబడి మందుపాతరాలు అమరుస్తున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా, తడపాల గ్రామ సమీపంలో మందుపాత్రలు అమర్చుతున్న మావోయిస్టులు, పోలీసులు చూసి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.

అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి ఒక డిబిబిఎల్ తుపాకీ, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకీ టాకీలు, పేలుడు సామాగ్రిని స్వాధినం చేసుకున్నట్లు సమాచారం.

అరెస్ట్ అయిన వారిలో వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ డిప్యూటీ దళ కమాండర్ రీతాతో పాటు ఇద్దరు దళ సభ్యులు, ముగ్గురు మిలీషియా సభ్యులు ఉన్నారు. పట్టుబడిని వారు కారం భుద్రి అలియాస్ రీతా, సోడి కోసి అలియాస్ మోతే, సోడి విజయ్ అలియాస్ ఇడుమ, కుడం దస్రు, సోడి ఉర్ర, మడకం భీమాగా గుర్తించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form