ఎండకు సొమ్మసిల్లిన విద్యార్ధులు…ఆసుపత్రికి తరలింపు

Published on 

బీహార్‌లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఇంతటి ఎండలోనూ స్కూళ్లు పనిచేస్తుండటంతో బుదవారం ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య విశాఖను సంప్రదించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో విద్యార్థినులందరినీ పాఠశాల సిబ్బంది ప్రైవేట్ వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై ధర్నాకుదిగారు.

ఈ ఘటనపై అరియారి బ్లాక్ లోని మన్కౌల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రార్థనల అనంతరం పదుల సంఖ్యలో చిన్నారులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. దీంతో పిల్లలందరినీ ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ చిన్నారులంతా డీహైడ్రేషన్ బారిన పడ్డారని వైద్యుడు సత్యేంద్ర కుమార్ తెలిపారు. పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form