పాకిస్తాన్‌లో మరో యువ జర్నలిస్ట్ హత్య

Published on 

.

  • మోటర్ సైకిల్‌పై వచ్చి హత్య
  • బెదిరింపులు వచ్చిన రెండు రోజులకే ఘటన
  • మిలిటెన్సీపై విమర్శనా కథనాలు వెలువరించినందుకే
  • 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత హత్యగావించబడిన నాల్లవ జర్నలిస్ట్

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో ఓ యువ జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు మంగళవారం హత్య చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర వజీరిస్థాన్‌లోని తాపీ ప్రాంతంలో కమ్రాన్ ఖాన్ అనే జర్నలిస్టుపై మోటర్ సైకిలపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేశారని, . కాల్పుల అనంతరం దుండగులు పారిపోయారని తెలిపారు.

ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మాజీ సభ్యుడు మొహ్సిన్ దావర్ మంగళవారం ఒక పోస్ట్‌లో మిలిటెన్సీకి వ్యతిరేకంగా తన విమర్శనాత్మక అభిప్రాయాలకు వ్యక్తం చేసినందుకు కమ్రాన్ హత్యా బెదిరింపులను ఎదుర్కొన్నాడని పేర్కొన్నాడు.

30 ఏళ్ళ కమ్రాన్ దావర్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉత్తర వజీరిస్థాన్‌లోని సామాజిక సమస్యలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందు కు కమ్రాన్ Facebook మరియు YouTube ఛానెల్‌ని నడిపుతున్నాడని తెలుస్తోంది.

ఒక స్థానిక గిరిజన జర్నలిస్ట్ ఫ్రీడమ్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ, కమ్రాన్ మిరాన్‌షా ప్రెస్ క్లబ్‌కు “తాను బెదిరింపు కాల్‌లు వస్తున్నాయని” చెప్పాడని. అయితే, అతను ఈ కాల్‌ల వివరాలను లేదా కాల్ చేసినవారి గుర్తింపును ఇవ్వలేదని తెలిపాడు.

అయితే, జర్నలిస్టు కమ్రాన్ హత్యను జర్నలిస్టు సంఘం ఖండించింది. ‘‘నేరం చేసిన నిందితులకు న్యాయం జరిగేలా విచారణ జరిపించాలని‘‘ డిమాండ్ చేశారు.

యునైటెడ్ స్టేట్స్‌లో 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత ఈ ప్రాంతంలో చంపబడిన నాల్గవ పాత్రికేయుడు కమ్రాన్ అని DPO నార్త్ వజీరిస్తాన్ రుఖాన్ జెబ్ ఖాన్ స్థానిక మీడియాకు తెలిపారు.

గ్లోబల్ మీడియా వాచ్‌డాగ్ అయిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో పాకిస్థాన్ 145వ స్థానంలో ఉండటం గమనార్హం. అయితే కమ్రాన్ హత్యకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదని తెలుస్తోంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form