75వ రోజుకు చేరిన బలూచిస్తాన్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆందోళన..

Published on 

క్వెట్టాలోని బలూచిస్తాన్ యూనివర్సిటీ ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళన 75వ రోజుకు చేరుకుంది. యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడం, పరిపాలనా పరిపాలన పరమైన అవకతవకలకు వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఆర్థిక సంక్షోభం కారణంగా యూనివర్శిటీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు జీతాలు అందడం లేదని, యూనివర్సిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాల్లో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు అందడం లేదని, వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని రాజధాని నగరంలోని క్వెట్టాలోని సరియాబ్ రోడ్‌లోని విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద 74 రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు .

ఈ సందర్భంగా బలూచిస్థాన్ యూనివర్సిటీ ఉద్యోగులు మాట్లాడుతూ.. జీతాలు, పెన్షన్లు ఇవ్వకపోవడం ప్రాథమిక మానవ హక్కులను, రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తమ జీతాల చెల్లింపు కోసం విశ్వవిద్యాలయ ప్రధాన గేటు వద్ద శాంతియుతంగా నిరసనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బలూచిస్థాన్ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కేంద్రాలు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రంగా పరిష్కరించాలని బలూచిస్తాన్ ముఖ్యమంత్రిని, గవర్నర్‌ను కోరారు. రాబోయే వార్షిక బడ్జెట్‌లో కనీసం 10 వేలకోట్ల రూపాయలు కేటాయించాలని, ఎండోమెంట్ నిధుల కోసం 5 బిలియన్ రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు అదనంగా, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ సర్ఫరాజ్ ఖాన్ బుగ్తీ ప్రకటించిన బెయిలౌట్ ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని, కోరారు.

తమ సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే సరియాబ్ రోడ్డుకు నిరసన శిబిరాన్ని తరలిస్తామని, రహదారిని పూర్తిగా దిగ్బంధిస్తామని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form