హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆయన కూతురు ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసు కేబిన్ సహా 10 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. విశాఖలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో ఈ సోదాలు చేస్తున్నాట్లు తెలుస్తోంది.
సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఆయన విచారణ అధికారి ఉమామహేశ్వరరావు ఉన్నారు. అలాగే ఏసీపీ సన్నిహితులు, బంధువులు ఇళ్లలోనూ దాడులు చేస్తోంది ఏసీబీ. గతంలో ఆయన ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు వెళ్లువెత్తాయి. 40 లక్షలు పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆయన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.