తెనాలి ఎమ్మెల్యేపై కేసు నమోదు

Published on 


గుంటూరు జిల్లా తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శివకుమార్‌తోపాటు మరో ఏడుగురిపై ఎఫ్​ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్లు 341, 323 కింద తెనాలి రెండో పట్టణ పోలీసులు కేసు కట్టారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

నిన్న తెనాలిలోని ఐతానగర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు ఓటును వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిలబడ్డారు అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్‌ దంపతులు ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్తుండగా గొట్టిముక్కల సుధాకర్‌ అనే ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. గంటల తరబడి తాము క్యూలైన్లో నిలబడితే నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడాన్ని ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే ఓటు వేసి వచ్చిన తరువాత గొట్టిముక్కల సుధాకర్‌ చెంపపై కొట్టడంతో బాధితుడు కూడా ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు బాధితుడిపై ముకుమ్మడి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

బాధితుడిని అక్కడే ఉన్న పోలీసులు స్టేషన్‌కు అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. బాధితుడిపై దాడి వీడియో రాష్ట్రవ్యాప్తంగా కాకుండా జాతీయ ఛానళ్లలోనూ విస్తృతంగా ప్రచారం కావడంతో భారత ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి ఎమ్మెల్యేను వెంటనే గృహ నిర్భందం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని గృహనిర్భందం చేశారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులు ఎమ్మెల్యేపై కే నమోదు చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form