కేజ్రీవాల్‌పై పిటిషన్ కొట్టివేత

Published on 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పించాలని కోరుతూ కాంతి భాటీ అనే వ్యక్తి ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ని సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే చట్టపరమైన హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పదవిలో కొనసాగాలా? వద్దా? ఆయన వ్యక్తిగత విషయమని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form