పదేళ్ల బీజేపీ పాలక ధనవంతులకోసమే పనిచేసింది : ప్రియాంక గాంధీ

Published on 

  • నోట్ల రద్దు, జీఎస్టీ తో సామాన్యుడి నడ్డి విరిగింది.
  • ఐఐఎం, నవోదయ విద్యా సంస్థలు అడిగిన పెడచెవిన పెట్టారు.
  • విమానాశ్రాయాలు, కంపెనీలు, విద్యుత్‌లను కార్పోరేట్ శక్తులకు అప్పగించారు.
  • వాస్తవాలు తెలియకుండా మీడియాను గుప్పిట్లో పెట్టుకున్నారు.

బీజేపీ 10 ఏండ్ల పాలన ధనవంతుల ప్రయోజనాలకోసమే పనిచేసిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ. తాండూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రియాంక బీజేపీ పార్టీపై విమర్శణాస్త్రాలు సంధించారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ సంక్షేమ పథకాలు లేవనీ, పేదల కోసం, వెనుకబడిన వాళ్లకోసం, నిరుపేదలకోసం, కార్మీకుల కోసం, రైతుల కోసం ఆ పార్టీ చేసిందేమీ లేదన్నారు. మన టాక్స్‌లు రోజురోజుకు పెరుగుతున్నా ధనవంతుల టాక్స్‌లు మాత్రం పెరగటం లేదన్నారు. లక్షరూపల రుణం కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం సహాకారం అందించడం లేదని విమర్శించారు.

నోట్ల రద్దు, జీఎస్టీ రావడం వల్ల సామాన్యుడి నడ్డి విరిగిందన్నారు. చిన్న చిన్న వ్యాపారులు సమస్యలు ఏటీకేటికీ పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ఈ పాంత్ర ప్రజలు ఐఐఎం, నవోదయ విద్యా సంస్థలు కావాలని కోరినా కేంధ్రప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పనులు కాంగ్రెస్ హాయంలో ప్రారంభం అయినా అయి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయాయి అన్నారు.

ఈ దేశంలోని విమానాశ్రాయాలు, కంపెనీలు, విద్యుత్ అన్నీ పెద్ద పెద్ద కార్పోరేట్ శక్తులకు అప్పగించారని, అదానీ, అంబానీలకు రాయితీలు ఇస్తూ దేశ సంపదలను లూటీ చేస్తున్నాయన్నారు. దేశంలోని అతి పెద్ద టీవీ సంస్థలన్నీ వాళ్ల చేతిలోకి వెళ్లిపోవడంతో వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియకుండా పోతున్నాయని విమర్శించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ పేరుతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవాలు చూస్తే ఎవరి వికాస్ పెరిగిందో తెలిసిపోతుందన్నారు ప్రియాంక గాంధీ.

నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పిన బీజేపీ నాయకులు ఇవాళ నల్లధనాన్ని వాళ్ల వెనకే వేసుకున్నారని ఆరోపించారు. బేటీ బచావో అంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ నాయకులు ఇవాళ మహిళలను వేధింపులకు గురిచేసిన వ్యక్తులకు అండగా నిలబడ్డారని విమర్శించారు.

పదేళ్ల పాలన కాలంలో మోదీ ప్రజల సమస్యలు వినకుండా తన సొంత బాధను, గాథను చెప్పేందుకు ప్రయత్నించారనీ, కంటనీరు పెట్టుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించాడని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా వున్న ప్రతి పోస్టును భర్తీ చేస్తామని, రైతుల రుణమాపీ అమలు చేస్తామని, రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని అన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form