వైసీపీ అభ్యర్ధికి అల్లు అర్జున్ ప్రచారం

Published on 

ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎవరు ఎటువైపో తెలియని పరిస్ధితి నెలకొంది. సోషల్ మీడియాలో ఒకపార్టీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించి దానికి భిన్నంగా ఇంకో పార్టీకి చెందిన వ్యక్తికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం ఈ సారి ఎన్నికల్లో చూస్తున్నారు అక్కడ ప్రజలు.

తాగాజా మేగా అల్లుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా జనసేనా పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘రానున్న ఎన్నికల ప్రయాణంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరుసేవకి మీ జీవితాన్ని అంకితం చేసే మార్గం ఎంచుకున్నందుకు నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీరు కోరుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా‘‘ అంటూ ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా మద్దతు ప్రకటించాడు.

అయితే బన్నీ తాజాగా తన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు తన భార్య స్నేహారెడ్డితో కలిసి శనివారం ఉదయం వెళ్లారు. వైసీపీ నేత, ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా ర‌వి చంద్ర కిషోర్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. శిల్ప రవి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు. దీంతో శిల్ప రవి కోసం అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేయడానికి రావడంతో అభిమనులు భారీ ర్యాలీతో, గజమాల వేసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మొదట శిల్ప రవి ఇంటి వద్దకు వెళ్లగా అక్కడికి భారీగా జనాలు తరలి వచ్చారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form