సీఎం కేజ్రివాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో తీహార్ జైలు వద్ద కేజ్రివాల్ కు ఆప్, నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన నివాసం వద్ద భారీ ఎత్తున బాణాసంచా కాల్చుతూ ఆప్ కార్యకర్తలు సందడి చేశారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రివాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కోర్టు కేజ్రీవాల్ కు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.