- ఐదు కేసుల్లో ఆధారాలున్నట్లు వెళ్లడి
- మే 21లోపు అభియోగాలు నమోదు చేయాలి
పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది.
ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియోగాలు మోపాలని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మే 21న బ్రిజ్ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు పేర్కొంది. అయితే మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. అయితే ఐదు కేసుల్లో తగిన ఆధారాలు ఉన్నట్లు కోర్టు తేల్చింది. ఆరో కేసును కొట్టివేసింది.