సీనియర్ ఐఏఎస్ అధికారి వేధింపులు భరించలేక రాహుల్ అనే సెక్రటేరియట్ ఉద్యోగి గుండెపోటుతో మరణించడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ అనే ఉద్యోగి కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని వద్ద పీఏగా పని చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా పని ప్రదేశంలో రాణి కుముదిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపించారు. సెక్రటేరియ ట్‌లోని రాణి కుముదిని ఛాంబర్ ముందు సచివాలయ ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చనిపోయిన రాహుల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.