- మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
- ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ కోరిన ఢిల్లీ సీఎం
- జూన్ 1 వరకూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ చీప్ అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆయనకు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. సీఎంగా విధులకు దూరంగా ఉండాలని సూచించింది.
మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ, ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ కోరిన ఢిల్లీ సీఎంకు జూన్ 1 వరకూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ట్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
అయితే ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం ‘‘ఇది అసాధారణ పరిస్థితి. అరవింత్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ఓ ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయి. పార్టీ అధినేతగా ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.