ఒవైసీ, నవనీత్ కౌర్‌ల మధ్య మాటల యుద్ధం

Published on 

బీజేపీ అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌ హైదరాబాద్‌లో ప్రచారం సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు తెలంగాణ పాలిటిక్స్‌లో మరోసారి దుమారం రేపుతున్నాయి.

5 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మేమేంటో చూపిస్తామని గతంలో అక్బరుద్దీన్ అన్న మాటలను గుర్తుచేస్తూ.‘అక్బరుద్దీన్ కు నేను సవాల్ విసురుతున్నా 15 నిమిషాలు ఎందుకు.. మాకైతే 15 సెకన్లు చాలు అన్నారు. ఆ 15 సెకన్లలోనే మీరు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లిపోతారో మీకే తెలియదంటూ నవనీత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే నవనీత్ కౌర్ మాటలకు ఏఐఎంఐం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.‘‘5 సెకన్లు కాదు గంట సమయం తీసుకోండి.. ముస్లింలను ఏం చేస్తారో చేయండని’’ ఎంఐఎం చీఫ్ సవాల్ విసిరారు. ‘‘అధికారమంతా మీ దగ్గరే ఉంది.. ఎక్కడికి రమ్మంటే తాము అక్కడికి వస్తామన్నారు’’. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం దుమారం రేపుతుంది.

అయితే నవనీత్ వ్యాఖ్యలుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని AIMIM డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా బీజేపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, నవనీత్ రాణా ఈ ప్రకటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ అన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form