AP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీనియర్ పోలీసు ఆఫీసర్ హరీశ్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది.
1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీశ్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో ఏపీ డీజీపీగా కొనసాగిన కేవీ రాజేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది గంటల్లోనే ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ ), మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.