టెల్ అవీవ్: శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 70 మంది పాలస్తీనియన్లు మరణించారని, వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారని అల్ జజీరా నివేదించింది.
ఆమెరికా ప్రతిపాధించిన గాజా శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకరించిందని వెంటనే గాజాపై “బాంబింగ్ ఆపండి” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను కోరినప్పటికీ గాజాపై దాడులు కొనసాగడం గమనార్హం.
ఇజ్రాయెల్ సైనిక దాడితో గాజా నగరంలో అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. గాజా నగరంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. ఇజ్రాయెల్ దాడులు పది లక్షలకు పైగా గాజా ప్రజలను ప్రభావితం చేశాయి, దీని వలన వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దక్షిణ గాజా వైపు వెళ్లాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇజ్రాయోల్ ఒక నివాస గృహంపై జరిగిన వైమానిక దాడిలో 18 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని, పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయని సహాయక సిబ్బంది తెలిపారు.
