రియాసి టెర్రర్ అటాక్ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సుమారు 50 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
రియాసి జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఆదివారం ఉగ్రవాదులు కాల్పులు విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 10 మంది మరణించగా.. 41 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. 1995-2005 మధ్యకాలంలో తీవ్రవాద కేంద్రాలుగా ఉన్న అర్నాస్, మహోర్ ప్రాంతాలను కవర్ చేస్తూ ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ దాడిలో ముఖ్యమైన లీడ్స్ బయటపడ్డాయని, దీంట్లో పాలుపంచుకున్న వారిని గుర్తించడం, పట్టుకోవడంలో సాయపడతాయని, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.