చేవెళ్ల: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని చెప్పారు.
కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
కాగ, చేవెళ్ల ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.























