బీజాపూర్‌లో 33 మంది నక్సల్స్ లొంగుబాటు

Published on 

బీజాపూర్ జిల్లాఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ ‘‘గిరిజనులపై మావోయిస్టులు సాగిస్తున్న దౌర్జన్యాలు, మావోయిస్టు భావజాలంతో నక్సలైట్లు నిరాశకు లోనుకావడం, పోలీసుల పునరావాస విధానాల పట్ల నక్సలైట్లు ఆకట్టుకోవడం తదితర కారణాల నక్సలైట్లు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నట్లు ఆయన తెలిపారు. లొంగిపోయిన 33 మంది కార్యకర్తల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని, వీరు మావోయిస్టుల గంగలూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలోని వివిధ శాఖలు, సంస్థల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు.

లొంగిపోయిన వారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్-1 సభ్యుడు రాజు హేమ్లా అలియాస్ ఠాకూర్ (35), ప్లాటూన్ నంబర్-1 సభ్యుడు సమో కర్మలపై రూ.2 లక్షల రివార్డును ఉన్నట్లు, తక్షణమే వాటిని అందజేయనున్నట్లు తెలిపారు.

లొంగిపోయిన ఇతర నక్సలైట్లలో మావోయిస్టు జనతన సర్కార్ (ఆర్‌పిసి) చీఫ్ సూద్రు పూనెం కూడా ఉన్నారనీ, అతనిపై లక్ష రూపాయల రివార్డు ఉందని తెలిపారు. లొంగిపోయిన ఈ ముగ్గురు నక్సలైట్లు భద్రతా బలగాలపై పలు దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. లొంగిపోయిన మిగతా నక్సలైట్లందరికీ ఒక్కొక్కరికి రూ.25 వేల సాయం అందించామని, ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని చెప్పారు.

జిల్లాలో ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకు 109 మంది నక్సలైట్లు హింసను విరమించుకున్నారని ఎస్సీ తెలిపారు. దీంతో పాటు ఇదే సమయంలో జిల్లాలో 189 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form