TS: నిన్న హైదరాబాద్లో కురిసిన భారీవాన 11 మందిని బలితీసుకుంది. అకాల వర్షానికి ఒకేరోజు ఇంతమంది మరణించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని బహుదూర్పూర్లో కరెంట్ పోల్ తగిలి విద్యుత్ షాక్తో ఫక్రూ అనే 40 ఏళ్ల వ్యక్తి చనిపోగా, అబ్దుల్పూర్మేట్లో మరో వ్యక్తి కరెంట్ షాక్తో మరణించాడు . బేగం పేటలో ఇద్దరు వ్యక్తులు నాలాలో కొట్టుకుపోయి మృతిచెందగా. వర్షం దాటికి బాచుపల్లిలో ఏకంగా ఏడుగురు మరణించారు. మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కూలిన గోడ శిధిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెల్లవారుజాము వరకు సహాయ చర్యలు చేపట్టారు. మృతులంతా ఒడిసా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా గుర్తించారు. బాచుపల్లిలో నూతనంగా నిర్మాణమవుతున్న హరిజాన్ కన్స్ట్రక్షన్ రోజువారి కూలీలుగా పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు.