TS: పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అపూర్వ ప్రగతి సాధించిందని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. 2013 నుంచి 2024 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం 84.3 శాతం పెరిగిందని అన్నారు. తెలంగాణ సాధించిన విజయాన్ని నిన్న పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి కూడా నిర్ధారించారని స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో మూడో స్థానంలో నిలిచిందని ఆర్థిక మంత్రి తెలిపారని హరీశ్‌రావు అన్నారు. ఇది ప్రజల జీవన ప్రమాణాలు, వినియోగ శక్తి పెరుగుదలకు స్పష్టమైన సూచికగా నిలుస్తుందని తెలిపారు.
తెలంగాణ ఈ వృద్ధి సాధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధాన కారణాలు అని పేర్కొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఐటీ, ఇండస్ట్రీ పాలసీలు, గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి అనేక కార్యక్రమాల వల్లే ఈ ఆర్థిక స్థిరత్వం సాధ్యమైందని వివరించారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు ఉన్న విజనరీ పాలనకు నిదర్శనమని అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి ఇది మరో సాక్ష్యమని చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అందజేసిన తలసరి ఆదాయం నివేదిక.
