ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం 10 మంది నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన మద్వి బుస్కాపై లక్ష రూపాయల రివార్ట్ ఉన్నట్లు జిలా సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే, దులేద్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌లో మద్వి బుస్కా, మద్వి జోగా, మడ్కం దేవాతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు.
బుస్కా ఎరన్‌పల్లి రివల్యూషనరీ పీపుల్స్ కౌన్సిల్ (RPC)లో మిలీషియా కమాండర్‌గా పనిచేస్తున్నాడని, మడ్కామ్ వ్యవసాయ విభాగంలో అధ్యక్షుడిగా, జోగా పెద్దబొడ్కెల్ RPC సెక్షన్ ‘A’ మిలీషియా డిప్యూటీ కమాండర్‌గా ఉన్నారని ఎస్సీ PTI వార్త సంస్థకు తెలిపారు.
రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ సిబ్బంది, స్థానిక పోలీసులు ,CRPF ఎలైట్ కోబ్రా విభాగానికి చెందిన 204, 206, 208వ బెటాలియన్లకు చెందిన సంయుక్త ఆపరేషన్‌లో వీళ్లను పట్టుకున్నట్లు తెలిపారు.