భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ 11 ఏళ్ల విరామం తర్వాత మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో ఈ నెల రాత్రి 10.34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8.04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరికి కేంద్రానికి బయలుదేరనున్నారు. అక్కడ వారం రోజులు గడిపి భూమికి తిరిగి వస్తారు.
సునీత తండ్రి దీపక్ పాండ్య స్వస్థలం ముంబాయి కాగా, తల్లి స్లోవేన్ అమెరికన్. అమెరికాలో స్థిరపడ్డ వీళ్లకి 1965లో సునీత జన్మించారు. 2006 డిసెంబర్ 9న తొలిసారి ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత 2009 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాల పాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డ్ నెలకొల్పారు సునీత.
తాజాగా ఈ నెల 6న మరోమారు అంతరిక్షానికి సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్),భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్ధ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు.