మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా: నరేంద్ర మోదీ

Published on 

ప్రధాని నరేంద్ర మోదీ మరో మారు తెలంగాణలో పర్యటించారు. ఇవాళ వేములవాడ, వరంగల్‌ల్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మొదట వేములవాడ రాజన్న ఆలయానికి చేరుకున్న మోదీ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విజయాన్ని కోరుతూ వేములవాడలో మాట్లాడారు.

అనంతరం వరంగల్‌కు చేరుకుని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకతీయ సామ్రాజ్య ప్రతీక వరంగల్ అని, అహ్మాదాబాద్ తన కర్మ భూమి.. ఆ నగర దేవత కూడా భద్రకాళి అంటూ ప్రధాని అన్నారు. మూడో విడత పోలింగ్ తో రెండు విషయాలు స్పష్టమయ్యాయన్నారు. బీజేపీ విజయం వైపు దూసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు.

బీజేపీకి రెండు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నప్పుడు అందులో ఒకరు హన్మకొండ నుంచే ఉన్నారంటూ ప్రధాని మోదీ గుర్తు చేశారు. తెలంగాణలో పసుపుబోర్డును ఏర్పాటు చేసి పసుపు రైతులకు అండగా నిలిచామన్నారు.

తమ హక్కు కోసం పోరాడుతున్న మాదిగలకు ఇచ్చిన హామీని తాను ఖచ్చితంగా నెరవేరుస్తానని మరోమారు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. 2014లో దళితుడిని సీఎంను చేస్తానన్న హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. అంతేకాదు.. దళిత బంధు పేరుతో మోసం చేసిందన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form