TS: రాష్ట్రంలో రైతుబంధు విడుదల ప్రారంభమైంది. ఈ పథకం కింద యాసంగి సీజన్‌కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నిధులు ఆర్థికశాఖ ద్వారా బ్యాంకులకు చేరగా సోమవారం నుంచి నేరుగా ఎకరాకు రూ.5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో 5 ఎకరాలకు పైగా ఉన్నవారు దాదాపు ఐదున్నర లక్షల మంది..5 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నవారు 4.4 లక్షలు, 10-24 ఎకరాలు ఉన్నవారు 94,000; 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారు 6,488 మంది ఉన్నారని తేలింది. వీరందరికీ జమ చేసేందుకు మరో రూ.2 వేల కోట్ల మేరకు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే మొదట్లో ప్రభుత్వం 5 ఎకరాల మేరకు సాయం అందించాలని భావించినప్పటికీ మిగిలిన రైతులు కూడా సాయం కోరడంతో ప్రభుత్వం తాజాగా వారికి కూడా నిధులు ఇవ్వాలని నిర్ణయించి, ఆర్థికశాఖను ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులు రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తున్నట్లు సమాచారం.
అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు విడుదలపై అధికారిక ప్రకటన విడుదల చేయనట్లేలు తెలుస్తోంది.