అంతరిక్ష పరిశోధకులకు శుభవార్త ..స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

Published on 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేయాలనుకునే వారికి శుభవార్త. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ‘విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్’ (వీఎస్‌ఎస్‌సీ) 2023-24 సంవత్సరానికి టెక్నీషియన్‌/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేయాలని ఆశించే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

అప్రెంటీస్ ప్రాతిపధికన ఈ పోస్టుల నియామకం వుంటుంది. మెకానికల్ ఇంజినీరింగ్​, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్‌మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్ మొదలైన విభాగాల్లోని మొత్తం 99 పోస్టులకు ఈ నియామకం చేపట్టనున్నారు. అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 50 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్ – 49 పోస్టులు వున్నాయి.

అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీలో క్వాలిఫై అయ్యుండాలి. 2024 ఏప్రిల్​ 30 నాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు 28 ఏళ్లు, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు 30 ఏళ్లు మించి ఉండకూడదు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000 స్టైపెండ్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 స్టైపెండ్ అందిస్తారు. ఎంపిక ప్రక్రియ డిప్లొమా లేదా డిగ్రీలో సాధించిన మార్కులు + రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ఆ ధారంగా అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. సెలక్షన్‌ డ్రైవ్ తేదీ 2024 మే 08 వుంటుంది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form