సునీతా రోదసి యాత్ర వాయిదా…!

Published on 

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర నిలిచిపోయింది. వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణమని తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ, చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ ను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ప్రకటించింది. అయితే అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు నాసా సిబ్బంది.

అంతరికక్షయానం కోసం తలపెట్టిన బోయింగ్ స్టార్నర్ (Boeing Starliner) అభివృద్ధిలో ఇప్పటికే అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్నర్ తొలి మానవరహిత యాత్ర సహితం భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోలేకపోయింది. మరో యాత్రలో పారాచూట్ సమస్యలు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం కలిగింది. అయితే స్టార్నర్ మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. కానీ తాజా యాత్రకు బయలుదేరాల్సిన రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే తిరిగి ఎప్పుడు చేపడతారనేది మాత్రం నాసా వెల్లడించలేదు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form